మే 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ?

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వానికి లాక్ డౌన్ ని ఆశ్రయించక తప్పలేదు. పదిరోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బుధవారం (మే12) నుంచి 21 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల సేవలకు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత 20 గంటల పాటు కఠిన లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలని ఇస్తుందనే అప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ నెల 21 తర్వాత కూడా మరో 10రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ పొడగిస్తారని సమాచారమ్. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేశారు. ప్రభుత్వం కూడా  అందుకు సానుకూలంగా ఉందని సమాచారమ్. దేశంలోనే మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఐతే అక్కడ లాక్ డౌన్ తర్వాత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కరోనా  కంట్రోల్ లోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోనూ మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రని ఫాలో కానుంది. మే31 వరకు లాక్ డౌన్ పొడగించనుందని సమాచారమ్. అదే నిజమైతే.. కరోనా సెకండ్ వేవ్ లో 20రోజుల పాటు తెలంగాణ లాక్ డౌన్ అయినట్టు అవుతుంది.