రెడ్లపై కోపం పెంచుకున్న పృధ్వీ !

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే.. 30 ఇయర్స్ పృధ్వీ పంటపడింది. ఆయనకు మంచి పదవి దక్కింది. టీటీడీ చైర్మన్ అయ్యారు. ఐతే అది మూడ్నాళ్ల ముచ్చటే. తీవ్ర విమర్శలు.. మహిళా వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి పోయింది. వైసీపీకి జగన్.. తల్లి తండ్రి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుల పెద్దలు, కుటుంబ పెద్దలు. వారికి ఇష్టం లేకపోవడం వల్లే రాజకీయాల్లో రాణించలేకపోయానని తాజాగా పృధ్వీ కామెంట్ చేశారు.

సీఎం జగన్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న రఘురామ కృష్ణంరాజు (ఆర్ ఆర్ ఆర్) గురించి కూడా పృధ్వీ స్పందించారు. అసలు ఆర్ఆర్ఆర్ అంటే తనకు తెలీదు. ఆయన మా రెబల్ ఎంపీనా. ఆయన సంగతి చూసుకోడానికి కుటుంబసభ్యులు ,పెద్దలు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి ,విజయ సాయి రెడ్డి ఈ ముగ్గురు రెడ్లు రాజకీయ దురంధరులు. ఆర్ఆర్ఆర్ సంగతి వాళ్ళు చూసుకుంటారని పృధ్వీ అన్నారు. పృధ్వీ మాటలని బట్టీ చూస్తే.. రెడ్లపై ఆయన కోపం పెంచుకుంటున్నారు. వారి కారణంగానే తన రాజకీయ జీవితం నాశం అయిందని భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో లోలోపల ఆనందపడుతున్నట్టున్నాడు కూడా.