రైతు భరోసా నిధులు విడుదల
కరోనా కష్టకాలంలోనూ కొత్త సంక్షేమ పథకాలని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అమలుచేస్తున్న పథకాలకు నిధులు విడుదల చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు రూ.89 వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపాం. గత 23 నెలల్లో రైతు భరోసా కింద రూ.17 వేల 29 కోట్లు విడుదల చేశాం. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చాం” అని వివరించారు.