వైరల్ :రవీంద్ర జడేజా జిమ్ వీడియో

రవీంద్ర జడేజా.. ఓ రేసుగుర్రం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ మెరుగుపు చూపిస్తాడు. టీమిండియా విజయాల్లో అతడిది కీలక పాత్ర. సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనలో రాణించేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతున్నారు.

తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జిమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జామ్‌నగర్‌ (గుజరాత్‌)లోని తన నివాసంలో ఉన్న జిమ్‌లోని పరికరాలను మొబైల్‌తో వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. రెండు ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ఇపుడీ జిల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Preparation starts here👊 #englandtour #workout pic.twitter.com/Y4hEfX9Lhl— Ravindrasinh jadeja (@imjadeja) May 12, 2021