సాయి పల్లవి బాలీవుడ్ సినిమా.. హీరో ఎవరో తెలుసా ?

సాయి పల్లవి.. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులని ఫిదా చేసింది. ప్రస్తుతం మూడు బాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇంతటి బిజీలోనూ బాలీవుడ్ లోకి ఇంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. అదికూడా తెలుగు హీరో సినిమాతో కావడం విశేషం. 

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఆమెతో సంప్రందింపులు జరుపుతున్నారట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సింది. 

ప్రస్తుతం సాయి పల్లవి మూడు సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, దగ్గుబాటి రానాతో ‘విరాటపర్వం’ చేసింది. ఈ రెండు సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటిస్తోంది. సాయి పల్లవి బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి భద్రకాఌ గెటప్ లో ఉన్న సాయి పల్లవి పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో కోల్ కతా నేపథ్యంలో వచ్చే ఏపీసోడ్ లో సాయి పల్లవి కనిపించబోతుందని తెలిసింది.