బాయ్ ఫ్రెండ్ తో లాక్ డౌన్ అయిన శృతి !

హీరోయిన్ శృతిహాసన్ చాలా ఓపెన్. అన్నీ బయటికి చెప్పేస్తుంటుంది. చూపిస్తుంటుంది. లండన్ బాయ్ ఫ్రెండ్ కోర్సల్ నుంచి విడిపోయిన తర్వాత తక్కువ టైమ్ లోనే శాంతను హజారికా అనే వ్యక్తికి కనెక్ట్ అయింది. ఆ విషయాన్ని ఏమీ దాచలేదు. బయటికి చూపించింది. కొత్త బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలని షేర్ చేసింది.

ఇప్పుడు ఏకంగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి ‘లాక్’ డౌన్ అయిపోయింది. ఈ విషయాన్ని చెబుతూ.. కొన్ని ఫొటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అక్కడితో ఆగలేదు. ఏకంగా ఇనస్టాగ్రామ్ లైవ్ కూడా ఇచ్చింది. ఇందులో తన కొత్త బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి మరిన్ని వివరాలు బయటపెట్టింది. ఇద్దరూ కలిసి ఎంత టైమ్ గడుపుతారనే ప్రశ్నకు ”రోజంతా” అనే సమాధానం ఇచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం రోజులో 24 గంటలు శాంతనుతోనే గడుపుతున్నానని తెలిపింది. మొత్తానికి.. ఈ లాక్ డౌన్ టైమ్ ను బాయ్ ఫ్రెండ్ తో సరదాగా గడిపేస్తోంది శృతిహాసన్. మరీ శాంతతో ప్రేమని పెళ్లి పీటల మీద వరకు తీసుకెళ్తుతుందేమో చూడాలి.

ఈ యేడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టింది శృతి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ లోనూ మెరిసింది. ఇందులో ఆమెది అతిథి పాత్రే. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’లో నటిస్తోంది. లాక్ డౌన్ తో సలార్ షూటింగ్ కి బ్రేక్ పడటంతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి లాక్ డౌన్ అయింది. రోజంతా అతడితో ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్నే పబ్లిక్ గా చెప్పేసింది.
