తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని టీకాలు వేశారంటే ?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పది రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వాక్సినేషన్ ని వేగవంతం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి వరకు 43,74,351 మందికి మొదటి డోస్.. 10,65,362 మందికి రెండో డోస్ టీకా ఇచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజు 657 మందికి తొలి డోస్, 33,438 మందికి రెండో డోస్ టీకా వేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 55,52,360 వ్యాక్సిన్ డోస్‌లు రాగా.. 54,39,713 డోస్‌ల వ్యాక్సిన్‌ను వినియోగించారు.