ఆర్ఆర్ఆర్ అరెస్ట్’పై చంద్రబాబు స్పందన
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ హైదరాబాద్లో ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆయనపై అభియోగం మోపారు. ప్రస్తుతం ఆయన్ను మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆర్ఆర్ఆర్ అరెస్ట్ పై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీపై దేశద్రోహం కేసు వేస్తారా? అని ప్రశ్నించారు.
కరోనా విపత్కర సమయాల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? జగన్ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గమని, కరోనా వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని చంద్రబాబు హితవుపలికారు. రఘురామ కృష్ణం రాజు వైసీపీ ఎంపీ. కాకపోతే రెబల్ ఎంపీ. వైసీపీ ఎంపీ అరెస్ట్ పై కూడా చంద్రబాబు ఆవేధన చెందుతుండటం ప్రశంచాల్సిన విషయమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.