చిన్నారులకు కరోనా టీకాలు ఎప్పుడు ?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. పిల్లలపై సెకండ్ వేవ్ ప్రభావం తక్కువే. కానీ రాబోయే మూడో వేవ్ మాత్రం పిల్లలపై అధిక ప్రభావం ఉండనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై టీకా ప్రయోగాలకు అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి.
ఐతే రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్ ప్రయోగాలకు భారత్ బయోటెక్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్, నొవావాక్స్ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి.