లాక్ డౌన్ పొడగింపుపై కేటీఆర్ కామెంట్
ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ నెల 12 నుంచి మొదలైన లాక్ డౌన్ 21 వరకు.. అంటే పదిరోజుల పాటు కొనసాగనుంది. ఐతే 21 తర్వాత కూడా తెలంగాణలో లాక్ డౌన్ పొడగిస్తారు. మరో 10 రోజులు.. అంటే ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఉండనుందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ లో Ask KTR కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… లాక్ డౌన్ పొడిగింపుపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుందని వెల్లడించారు.
ఇక లాక్ డౌన్ ని ప్రభుత్వం కఠినంగానే అమలు చేస్తోంది. ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే అన్నీ రకాల సేవలు నడుస్తున్నాయి. ఇక ఉదయం 10 తర్వాత నుంచి 20 గంటల పాటు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలనిస్తోందని.. అప్పుడే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పెంచితే పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోనికి వస్తాయని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారమ్.
Decision of further extension of lockdown will be taken by the state cabinet on 20th May https://t.co/WZTQUOvaH6— KTR (@KTRTRS) May 13, 2021