నాకు వయసైపోతోంది.. నా బాడీ షేప్ మారుతోంది

మగాడి జీతం, ఆడదాని వయసు అడక్కూడదు అంటారు. ఒకవేళ అడిగిన సరైనా సమాధానం రాదంటారు. కానీ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాత్రం అడక్కుండానే తనకు నాకు వయసైపోతోంది.. నా బాడీ షేప్ మారుతోందని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

“నిజమే నాకు వయసైపోతోంది. నా బాడీ షేప్ మారుతోంది. నేను మరింత పెద్దదాన్ని అవుతున్నాను. శారీరంగా, మానసికంగా దీన్ని నేను స్వీకరిస్తున్నాను. నా వయసుకు నేను ఎలా కనిపించాలో అలా కనిపిస్తున్నాను.
20 యేళ్ల వయసులో కనిపించినట్టు ఇప్పుడు కూడా కనిపించాలనే ఆశ తనకు లేదు. గ్లామర్ పేరిట శరీరాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వయసు పెరిగేకొద్దీ ఎంత అందంగా ఉన్నామనేది మన ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.

అన్నట్టు.. ప్రియాంక వయసెంతో తెలుసా ? అక్షరాల 38యేళ్లు.

