రాధే.. రికార్డ్ వ్యూస్ !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్ భాయి’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథానాయిక. జీ స్టూడియోస్‌, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన సినిమాకి అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్‌ నిర్మాతలు. ఈద్ కానుకగా ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో ఈరోజు ఓటీటీలో విడుదలైంది. జీ ప్లెక్స్‌, డిష్‌ టీవీల్లోనూ ‘రాధే’ అందుబాటులో ఉంది. సినిమాపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. 

తొలిరోజే రాధే 4.2మిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనందం వ్యక్తం చేసారు. ప్రేక్షకులకి ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. వాస్తవానికి రాధేపై మిక్సిడ్ టాక్ నడుస్తోంది. కానీ సల్మాన్ క్రేజ్ ముందు టాక్ పని చేయలేదు. టాక్ తో సంబంధం లేకుండా రాధే బ్లాక్ బస్టర్ వ్యూస్ రాబడుతోంది. ఈ వ్యూస్ లెక్కన చూస్తే.. రాధే బ్లాక్ బస్టర్ హిట్టే. 

Wishing ev1 a v Happy Eid. Thank u all for the wonderful return gift by making Radhe the most watched film on day 1. The film industry would not survive without your love n support. Thank u 🙏 pic.twitter.com/StP48A9NPq— Salman Khan (@BeingSalmanKhan) May 14, 2021