హైకోర్టు లేకుంటే తెలంగాణ ఆగమే
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి భయమే లేదు. బలమైన ప్రతిపక్షం లేదు. గట్టిగా ప్రశ్నించే ప్రత్యర్థి లేడు. ప్రశ్నించినా.. వారి మాటలని చెవినపెట్టే ప్రభుత్వం కాదిది. ఈ నేపథ్యంలో న్యాయ స్థానమే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మారిందని పరిస్థితులని చూస్తే అర్థమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యల్లేవ్. పైగా రాజకీయ క్రీడా మొదలెట్టింది. సీనియర్ నేత ఈటెల రాజేందర్ ని టార్గెట్ చేసింది. ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది.
ఆయన వ్యవహారమే ముఖ్యం అన్నట్టుగా.. కోర్టుకు వెళ్లింది. ఈటెల అసైన్డ్ భూముల వ్యవహారంలో అతి చేయబోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఈటెల వ్యవహారమే ముఖ్యమైందా ? కరోనా పరిస్థితులు పట్టవా ? అంటూ కోర్టు అంక్షింతలు వేసింది. నైట్ కర్ఫ్యూ విషయంలోనూ కోర్టు 48 గంటల ఆల్టీమేటం వేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విషయంలోనూ అంతే. ఇప్పుడు ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ ని ఆపని విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడింది. అంతేకాదు.. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చని, ఫోన్ చేసిన వారికి కంట్రోల్‌రూమ్ సహకరించాలని ఆదేశించింది.
రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ తీరుని చూస్తుంటే.. హైకోర్ట్ లేకుంటే తెలంగాణ ఆగమేనని ప్రజలు చెప్పుకుంటున్నారు. దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి.. ఇలాంటి వ్యాఖ్యలు మాయని మచ్చలే అని చెప్పవచ్చు.