నా పెళ్లిళ్లు పెటాకులు.. తల్లిదండ్రులే కారణం !
గత ఏడాది మూడో పెళ్లితో ఒక్కసారిగా వార్తల్లో ఎక్కారు నటి వనిత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు ప్రధాన కారణం కుటుంబమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అదేలా అంటే ? జీవితం అంటే ఏమిటో తెలియని 18 ఏళ్ల వయసులో నాకు పెళ్లి చేశారు. నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు. మానసిక కుంగిపోయాను. చివరికి చేసేదేమీ లేక విడాకులు తీసుకున్నాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. నా వల్ల వాళ్ల పరువు పోతుందని భావించి నన్ను ఇంట్లో నుంచి గంటేశారు.
ముగ్గురు పిల్లలతో బయటికొచ్చిన తాను.. ఒక తోడు ఉంటే బాగుంటుందని ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాను. తను నన్ను బాగా చూసుకున్నాడు. చిన్న చిన్న గొడవలైనప్పటికీ మా జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయేది. ఆ టైమ్ లో మళ్లీ నాన్న ఎంటర్ అయ్యాడు. పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడో వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు అంటూ తన ఆవేధనని వెల్లగక్కింది.