కొరటాల సినిమా.. నాలుగేళ్ల గ్యాప్ !

‘గీత గోవిందం’తో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ దాదాపు రెండేళ్లకు పైగా ఖాళీగా ఉంటే పాపం అనుకున్నాం. ఫైనల్ గా ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అవకాశం వచ్చింది. హమ్మయ్యా.. ఆలస్యమైన పరశురామ్ పవర్ ఫుల్ ఆఫర్ కొట్టేశారు అనుకున్నాం. పరశురామ్-మహేష్ కాంబోలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఇప్పుడు టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ పరిస్థితి దాదాపు పరశురామ్ మాదిరిగానే ఉంది. గీత గోవిందం ’15 ఆగస్టు 2018′ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతకంటే ముందే 20-4-2018…మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలైంది. ఈ సినిమా తర్వాత కొరటాల నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పటికే మూడేళ్లు దాటిపోయాయ్. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అన్నాక.. కొరటాల వెయిట్ చేశారు. చాలా రోజులు వెయిటింగ్ అయింది. కానీ కేవలం 90రోజుల్లోపు ఆచార్య షూటింగ్ ని అవగొడదామని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ రెండు విడతల కరోనాతో కొరటాల ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. అన్నీ కలిసి ఆచార్య సినిమాను వెనక్కు వెనక్కు నెడుతూనే వస్తున్నాయి.

ఆచార్య సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో కొరటాల సినిమా ఫిక్సయింది. కానీ పుష్ప రెండు భాగాలు అనేసరికి.. కొరటాల ఎన్ టీఆర్ తో ఫిక్సయ్యాడు. ఇప్పుడు ఎన్ టీఆర్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఓ వైపు ఆచార్య షూటింగ్ పూర్తిగాక, ఎన్ టీఆర్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియక.. కొరటాల తికమక పడుతున్నాడు. చూస్తేంటే.. వచ్చే యేడాది (2022) సమ్మర్ వరకు కొరటాల నుంచి సినిమా వచ్చేలా లేదు. అంటే..  దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత కొరటాల నుంచి సినిమా రాబోతుంది అన్నమాట. టాలీవుడ్ టాప్ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమే మరీ… !