సైజులు, సోకులు ఫుల్.. నటన నిల్ !

అందం+అభినయం తెలిస్తేనే హీరోయిన్ గా రాణించగలరు. స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకోగలరు. కానీ కేవలం గ్లామర్ తోనే స్టార్ హీరోయిన్.. అంతకుమించిన రేంజ్ ని సొంత చేసుకోవడం హాట్ బ్యూటీ దిశా పటానీకే చెల్లింది. నిండైనా అందాలు ఆమె సొంతం. వాటిని ఏమాత్రం దాచుకోకుండా.. తరచూ ఫోటో షూట్ చేస్తుంటుంది. హాట్ హాట్ అందాలని అభిమానులని అలరిస్తుంటుంది.

అందుకే సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మించిన ఫాలోయింగ్ పటానీ సొంతం. ట్విట్టర్ లో 6.3మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలోనూ అదే రేంజ్. ఆమె నటించిన సినిమాల కోసం కాకుండా.. ఆమె ఫోటో షూట్ ఫోటోల కోసం వేచి చూసే ప్రత్యేక అభిమానం గణం ఉంది. ఆ రేంజ్ లో పటానీ అందాల విందు ఉంటుంది. ఎద అందాలతో గాలం వేస్తుంటుంది. మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తుంటుంది. ఇది ఫోటో షూట్ వర్షన్. సినిమాల్లోనూ.. ఆమె సైజులు, సోకులని నమ్ముకోవడం విశేషం.

పటానీ గ్లామర్ కు ఎవరు వంక పెట్టలేరు. కానీ నటనలో మాత్రం ఇంకా ఎదగాలి. అందానికి తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఉండవ్. కేవలం గ్లామర్ తోనే.. ఇంకా చెప్పాలంటే సైజులు,సోకులే పెట్టుబడిగా సినిమాలు చేస్తోంది. వాటికి తోడు నటనలోనూ రాటుదేలితే.. పటానీకి ఎదురుండదు. ఆమె అందంతో పాటు నటనని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. ఇండస్ట్రీలో ఇంకాస్త ఎక్కువ కాలం ఉండొచ్చు. మరీ.. ఈ నిజాన్ని హాట్ బ్యూటీ ఎప్పుడు గ్రహిస్తుందో చూడాలి. ఆమె తాజా చిత్రం రాధేలోనూ గ్లామర్ కే పరిమితం అయింది. నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు.







