TSలోకి AP అంబులెన్స్’లు

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో అంబులెన్స్‌లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఏపీ అంబులెన్స్ ని అనుమతిస్తున్నారు.

ఏపీ-తెలంగాణ సరిహద్దుల అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో అత్యవసర వైద్యం అవసరమైన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు రోగులు మృతి చెందారు కూడా. దీంతో ఏపీ ప్రజలు, రాజకీయవర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఐతే తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. అంబులెన్స్ ల అనుమతి సమస్య తీరినట్టయింది.