నేను ఆ టైప్ కాదు : రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ – అతి తక్కువ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత కోలీవుడ్ లోనూ రాణించింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం నటిగా తృప్తికరమైన స్టేజ్ లో ఉన్నా అంటోంది రకుల్. భయంతో బ్రతికే టైపు కాదు నేను. ఎందుకంటే ఇక్కడికొచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ఎంతోమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో నాకు ఛాన్సులొస్తున్నాయి. నా కలను నేను సాకారం చేసుకున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి అంటోంది.

కథ లేదా క్యారెక్టర్ బట్టి సినిమాలు ఎంచుకుంటానని చెప్పలేను. తన సినిమా సెలక్షన్ ఎప్పటికప్పుడు మారిపోతుందని చెప్పుకొచ్చింది. ఓసారి కథ నచ్చుతుంది. అందులో తప్పనిసరిగా భాగం అవ్వాలనిపిస్తుంది. మరోసారి నా పాత్ర నచ్చుతుంది. ఇంకోసారి మంచి డైరక్టర్ సినిమా పడొచ్చు, లేదంటే పెద్ద హీరో సినిమా పడొచ్చు. ఇలా ప్రాజెక్టులు అంగీకరించే విషయంలో ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమని రకుల్ తెలిపింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో క్రిష్ సినిమాలో నటిస్తోంది.