ఆర్పీ-తేజ‌.. ట్యూన్ కుదిరింది !

తేజ, ఆర్పీ.. ఇద్దరూ పీక్స్ చూసినవారే. తేజ మ్యాజిక్కుకు ఆర్పీ మ్యూజిక్ కలిస్తే.. సూపర్ హిట్టే. వీరి కలయికలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, జ‌యం..  సూపర్ హిట్ అయ్యాయ్. వీరిద్దరు దాదాపు ఒకే టైమ్ లో ఎదిగారు. ఇంకా చెప్పాలంటే కలిసే హిట్స్ కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ డౌన్ అయ్యారు. ఆర్పీ నుంచి మంచి ట్యూన్ వినక చాన్నాళ్లయింది. ఆయన మధ్యలో డైరెక్షన్ అంటూ వెళ్లి చేతులు కాల్చుకున్నారు. తేజ మాత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత చేసిన తేజ మళ్లీ రొటీన్ అనిపించారు.

ఇప్పుడు తేజ-ఆర్పీ మళ్లీ కలిశారు. వీరిద్దరి మధ్య  ట్యూన్ కుదిరింది. తేజ నుంచి వ‌స్తున్న చిత్రం 1.1 కోసం ఆర్పీ బాణీల్ని స‌మ‌కూరుస్తున్నాడు. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రానికి తేజ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి కూడా ఆర్పీనే సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మళ్లీ ట్రాక్ పడతారేమో చూడాలి.