TSలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు నోడల్ కేంద్రం

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.  నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది.

బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మాత్రం పూర్తిగా కోఠిలోని ఈఎన్‌టీలోనే చికిత్స అందిస్తామని స్పష్టంచేసింది. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్‌ స్థాయిని సరిగా అదుపుచేయాలని డీఎంఈ సూచించింది.