భారత్ లో పరిస్థితులు చాలా దారుణం :WHO

భారత్‌లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా తొలి ఏడాది కంటే రెండో ఏడాది చాలా దారుణం ఉండనుందని తెలిపారు.

WHO తరఫున భారత్‌కు కావాల్సిన సాయం అందజేస్తున్నామని అధనామ్‌ తెలిపారు. ఇప్పటికే వేలాది ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, మొబైల్‌ ఆసుపత్రులు, మాస్కులు సహా ఇతర వైద్య సరఫరాలను అందజేశామన్నారు. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మహమ్మారి కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్‌తో పాటు వైద్యపరమైన జాగ్రత్తలు సైతం కొనసాగించాలన్నారు.