తెలుగు సినిమా.. OTTకి దూరం!
కరోనా విజృంభణతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ప్రేక్షకులు ఓటీటీకి బాగా కనెక్ట్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య భారీగా పెరిగింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని బాషల సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఐతే మిగితా బాషలతో పోలిస్తే తెలుగు సినిమాల ఓటీటీ రిలీజ్ చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే.. ? పెద్ద సినిమాలు ఏవీ ఓటీటీల వైపు చూడటం లేదు. దానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు.
తొలి విడత టైమ్ లో క్లారిటీ లేదు. కానీ తరువాత క్లారిటీ వచ్చింది. ఒకసారి థియేటర్లు ఓపెన్ కాగానే జనాలు సర్రున దూసుకువచ్చారు. కలెక్షన్లు కుమ్మేసాయి. ప్రతి నెల ఒక సినిమా వంతున హిట్ లు వచ్చాయి. ఇప్పుడు రెండోవిడత కరోనా వచ్చినా అదే భరోసాగా వుంది. మళ్లీ థియేటర్స్ తెరచుకుంటే.. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయ్. మళ్లీ జనాలు థియేటర్స్ వస్తారు. సినిమాలని ఆస్వాదిస్తారనే నమ్మకంతో టాలీవుడ్ దర్శక-నిర్మాతలు ఉన్నారు. అందుకే ఓటీటీల నుంచి వస్తున్న మంచి ఆఫర్స్ ని కూడా తిరస్కరిస్తున్నారు.
ఇప్పటికే ఖిలాడీ ఓటీటీ రిలీజ్ కి నో చెప్పేశాడు. నేరుగా థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుందని ఖిలాడీ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. చైతన్య-సాయిపల్లవి ల ‘లవ్ స్టోరీ’ సినిమాను ఓటిటికి ఇవ్వమని అడుగుతున్నా, నిర్మాతలు సుముఖంగా లేరు. నాగశౌర్య రెండు సినిమాలు వరుడు కావాలి, లక్ష్య రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. కానీ ఓటీటీల వైపు చూడటం లేదు. మొత్తానికి. తెలుగు సినిమా ఓటీటీలకు దూరం అని హింట్ ఇస్తోంది. మిగితా బాషల సినిమాల ఓటీటీ రిలీజ్ వైపు ఆసక్తి చూపుతుంటే.. తెలుగు సినిమా మాత్రం అందుకు నో అంటోంది. బహుశా.. కథాబలం లేకనేమో.. !