ఆహా.. మారుతి కూడా శిష్యా ఫార్ములా !
ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్క చేత్తో సంపాదిస్తే సరిపోదు. రెండు చేతుల్లా సంపాదన ఉండాల్సిందే. స్టార్ హీరో అయితే.. ఓ సొంత బ్యానర్ లో నిర్మాత మారడం. చిన్ని సినిమాలు, మీడియా రేంజ్ సినిమాలు తీసి.. తన బ్రాండ్ తో ప్రమోట్ చేసుకోవడం, సొమ్ము చేసుకోవడం. దాదాపు స్టార్ హీరోలందరికీ సొంత బ్యానర్స్ ఉన్నాయ్. ఇక దర్శకులది ఇదే దారి. కాకపోతే.. శిష్యులని రంగంలోకి దింపుతారు. కథ-కథనం నాది.. డైరెక్షన్ మాత్రం నా శిష్యుడి అంటూ.. రెండో చేత్తో సంపాదిస్తుంటారు.
ఇలా ఫార్ములాతో దర్శకుడు సుకుమార్ ఫుల్ గా సక్సెస్ అయ్యారు. సుకుమార్ ఒక్కరే కాదు.. మరికొందరు దర్శకులు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా శిష్యులని రంగంలోకి దింపుతున్నారు. ఆహా ఎక్స్‌క్లూజీవ్ పేరుతో.. కొన్ని వెబ్ మూవీస్ ని నిర్మించడానికి రెడీ అయ్యింది ఆహా. అందుకోసం కొంతమంది యువ దర్శకులతో డీల్ కుదుర్చుకుంటోంది. ఓ ప్యాకేజీలా మాట్లాడుకుని, సినిమాల బ్యాంక్ పెంచుకుంటోంది. అందుకోసం మారుతి రెండు కథలు రెడీ చేసి పెట్టుకున్నాడట. తక్కువ లొకేషన్లు, పరిమిత బడ్జెట్ తో ఈ రెండు కథల్ని పూర్తి చేయాలనుకుంటున్నాడట. ఈ రెండు సినిమాలకు మారుతి శిష్యులు దర్శకత్వం వహిస్తారు.