సమంత వెబ్ సిరీస్ ట్రైలర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ద ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సీరీస్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సామ్ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రేపు (మే19) రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారింగా ప్రకటించింది. ఇక జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుందని సమాచారమ్. రిలీజ్ డేటుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బహుశా.. రేపు రిలీజ్ కానున్న ట్రైలర్ లో రిలీజ్ డేటుని ప్రకటిస్తారేమో.. !

ఇందులో సమంత బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ఇది వరకు ఎప్పుడూ కనిపించనంత హాటుగా కనిపించనుంది. సామ్ పాత్ర బోల్డ్ మాత్రమే కాదు.. థ్రిల్ ని పంచుతుందని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులు తనని తిట్టుకుంటారని ఓ ఇంటర్వ్యూలో సామ్ తెలిపింది. అంత క్రూరంగా ఆమె పాత్ర ఉండనుందట. ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ ని సామ్ ఇంట్లోనే గడుపుతోంది.