ఒక్కరోజే 4,329 మంది మృతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఐతే గత కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అత్యధికంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,329 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక.. ఇప్పటివరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే.
24 గంటల వ్యవధిలో దేశంలో 2,63,533 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.52 కోట్లకు చేరింది. ప్రస్తుతం 33,53,765 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది.