అభిరామ్.. యాక్షన్ హీరో !

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఖరారైంది. తేజ దర్శకుడు. తేజ సినిమాతో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు అన‌గానే.. ఇది కూడా మ‌రో ల‌వ్ స్టోరీ ఏమో అనుకున్నారంతా.  కొత్త‌వాళ్ల‌తో ఎప్పుడూ ప్రేమ‌క‌థ‌లే తీశాడు తేజ‌. కానీ ఈ సారి తేజరూటు మార్చాడు. అభిరామ్ కోసం యాక్ష‌న్ క‌థ‌ని రెడీ చేశాడ‌ట‌. ఆ కథని సురేష్ బాబు కూడా ఓకే చేశారు.

వాస్తవానికి అభిరామ్ కు ప్రేమకథలు, రొమాంటిక్ స్టోరీస్ కరెక్ట్. ఆయనపై ఇప్పడి వరకు ఉన్న ఇమేజ్ అదే. అందుకే సురేష్ బాబు తెలివిగా ఆలోచించినట్టున్నారు. ఇప్పటికే అభిరామ్ పై రొమాంటిక్ ఇమేజ్ పడిపోయింది. ఓ బోల్డ్ నటితో.. బోల్డ్ పిక్స్ బయటికొచ్చాయ్. ఎంట్రీ సినిమాతోనే మళ్లీ రొమాన్స్ లోకి దించితే.. సటైర్స్ పడతాయని.. యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇప్పిస్తున్నారు. మరీ.. యాక్షన్ లో అభిరామ్ ఏ మేరకు ఇరగదీస్తాడో చూడాలి.