ఆర్ఆర్ఆర్ అరెస్ట్ వెనక.. అమిత్ షా, కేసీఆర్ ?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బర్త్ డే రోజునే ఆర్ఆర్ఆర్ ని అరెస్ట్ చేయడం.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించడం జరిగింది. అరెస్ట్ చేసిన రాత్రి పోలీసుల కస్టడీలోనే ఉంచడం జరిగింది. తెల్లారి కోర్టులో హాజరుపరిచిన ఆర్ ఆర్ ఆర్ కాలికి గాయాలున్నాయ్. అవి పోలీసులు కొట్టిన దెబ్బలేనని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. అవి నిజమైతే పోలీసులపై తీవ్ర చర్యలు ఉంటాయని కోర్టు కామెంట్ చేసింది. 

ఇక కోర్టు ఆదేశాలని కాదని ఆర్ఆర్ఆర్ ని జైలుకి తరలించడం ఓ షాకింగ్. కోర్టు చెప్పినట్టు రమేష్ ఆసుపత్రికి ఆర్ఆర్ఆర్ తరలించడం ఇష్టం లేకే.. అలా చేసినట్టు సమాచారమ్. ఫైనల్ సుప్రీం ఆదేశాలతో ఆర్ ఆర్ ఆర్ ని హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు అక్కడే ఉండనున్నారు. 

మరోవైపు ఆర్ఆర్ఆర్ అరెస్ట్ వెనక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, తెలంగాణ  సీఎం కేసీఆర్‌ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రఘురామ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని, చట్టప్రకారం, కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.