ద ఫ్యామిలీ మెన్ 2.. ప్రేక్షకులకి ఓ బ్యాడ్ న్యూస్ !

ఎదురుచూపులు ముగిశాయ్. ‘ద ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రేపే ట్రైలర్ రిలీజ్. జూన్ 4న వెబ్ సిరీస్ విడుదల కానుంది. దీంతో.. ద ఫ్యామిలీ మెన్ అభిమానులు సూపర్ హ్యాపీ. ఐతే ఈ వెబ్ సిరీస్ విషయంలో అమెజాన్ ప్రైమ్ చేసిన సూపర్ ప్లాన్ గురించి తెలిసి నిరాశపడుతున్నారు.

ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 మొత్తం 10 ఎపిసోడ్స్ కాగా వాటన్నిటినీ కూడా ఒకేరోజు రిలీజ్ చేశారు. కానీ సీజన్ ఎపిసోడ్స్ ను మాత్రం అలా కాకుండా వారానికోక ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. తప్పకుండా సీజన్ 2 క్లిక్కవుతుందని అమెజాన్ ప్రైమ్ గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ పెంచుతోంది. కానీ వారానికో ఏపీసోడ్ అంటే ప్రేక్షకులు సస్పెన్షన్ ని తట్టుకోగలరా ?!

ఇందులో సమంత బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ఇది వరకు ఎప్పుడూ కనిపించనంత హాటుగా కనిపించనుంది. సామ్ పాత్ర బోల్డ్ మాత్రమే కాదు.. థ్రిల్ ని పంచుతుందని చెబుతున్నారు. ఒక ఉగ్రవాది పాత్రలో సరికొత్తగా.. అతి క్రూరంగా కనిపించనుంది. ఇక రేపు రిలీజ్ కానున్న ట్రైలర్ ని చూసిన తర్వాత ద ఫ్యామిలీ మెన్ 2 కంటెంట్ పై ఓ క్లారిటీ రానుంది.