గంగుల వర్సెస్ ఈటెల.. ఎవరిది పైచేయి ?

ఆపరేషన్ ఈటెల – సీఎం కేసీఆర్ విజయవంతంగా ఎక్సిక్యూట్ చేశారు. ఈటెలపై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు.. దానిపై సీఎం కేసీఆర్ జెడ్ స్పీడుతో చర్యలు చేపట్టడం చూశాం. ఆరోపణలు వచ్చిన 24గంటల్లోపు ఈటెలని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేశారు. ఆ స్పీడుని చూస్తే.. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనకుండా ఉందలేరు. కొడుకు కేటీఆర్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంలో భాగంగా చేసిన కేసీఆర్ చేసిన ఆపరేషన్ ఇదనే ప్రచారం ఉంది.

విజయవంతంగా ఈటెలని మంత్రి పదవికి దూరం చేశారు. పార్టీకి దూరం చేయడం పెద్ద సమస్యే కాదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా ఈటెలని చెప్పేశాడు. ఇక మిగిలింది రాజీనామా చేసిన ఈటెలని హుజూరాబాద్ లో ఓడించడమే. ఆ పనులని ఇప్పటి నుంచే మొదలెట్టాయి టీఆర్ఎస్ శ్రేణులు. హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు ఎవరూ టీఆర్ఎస్‌ను వీడకుండా.. ఈటల వెంట నడవకుండా చేసే బాధ్యతల్ని .. మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఆయన అదే మిషన్ మీద ఉన్నారు. 

ప్రతీరోజూ…హుజూరాబాద్ నియోజకవర్గ నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తాయిలాలు ఆశ చూపుతున్నారు. వినని వారిపై బెదిరింపులకూ వెనుకాడటం లేదు. అయితే ఇవాళ టీఆర్ ఎస్ లోనే ఉంటామని చెబుతున్న నేతలు.. వారం తిరిగేలోపు ఈటెలకు జై కొడుతున్నారు. ఆయన వెంటే ఉంటాం అంటున్నారు. బెదిరింపులకి భయపడం అంటున్నారు. ఈ లెక్కన హుజూరాబాద్ లో గంగులపై ఈటెల స్పష్టమైన పైచేయి సాధించినట్టు అర్థమవుతోంది. 

ఇక ఈరోజు హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఈటెల సీఎం కేసీఆర్, గంగుల కమలాకర్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 2023 తర్వాత మీరు అధికారంలో ఉండరు. బెదిరింపులకు పాల్పడితే ఖబర్థార్ అన్నారు. కోట్ల బిజినెస్ కోసం మంత్రి పాకులాడుతున్నారంటూ పరోక్షంగా గంగులపై కామెంట్ చేశారు. దీంతో జెడ్ స్పీడుతో మీడియా ముందుకొచ్చిన గంగుల.. దమ్ముంటే ఈటెల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ లోనూ ఈటెలదే పైచేయిగా కనిపించింది. సున్నితంగా, సుతిమెత్తగా.. ఈటెల చేసిన విమర్శలు గట్టిగానే తాకాయని చెప్పవచ్చు.