సూపర్.. సూపర్ మంత్రి !
సూపర్ మంత్రి అంటే ఏంటీ అనుకుంటున్నారా ? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో సూపర్ ఉమెన్ డైలాగ్ గుర్తుందా ? ముగ్గురు అమ్మాయిల కేసుల జెడ్ స్పీడుతో జెడ్ స్పీడుతో స్పందించిన లేడీ ఎస్ఐ పై పవన్ వేసిన సైటర్స్ బాగా పేలాయ్. సూపర్.. సూపర్.. సూపర్ ఉమెన్ అంటూ.. సిర్ఫ్ పాంచ్ మినెట్స్ లో మీరు అల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చారా ? అని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మంత్రి గంగుల కమాలర్ కూడా ఈటెల చేసిన వ్యాఖ్యలపై జెడ్ స్పీడుతో రియాక్ట్ అయ్యారు.
కొద్దిసేపటి క్రితం ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో తన మనుషులని బెదిరించడంపై తీవ్ర హెచ్చరికలు చేశారు. 2023లో మీ ప్రభుత్వ ఉండదు. మంత్రి కాకముందు ఎలా మాట్లాడిన, ఏం చేసిన నడుస్తది. కనీసం మంత్రి అయిన తర్వాతైనా మారాలి కదా. నీ కోట్ల వ్యాపారం భయటపెట్టమంటావా ? అంటూ పేరు చెప్పకుండా.. నియోజకవర్గ మంత్రి అంటూ ఏసుకున్నాడు. అవి మంత్రి గంగులకి బాగా తగిలాయ్.
కాలె.. కాలె అంటూ వెంటనే మీడియా ముందుకొచ్చారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి.. ఈటెల వర్సెస్ గంగుల యుద్ధం ఇప్పుడిప్పుడే ముదురుతోంది.