TSలో మరో భూ వివాదం.. తెరాస నేతలు కొట్టుకున్నారు !

తెలంగాణలో భూ వివాదాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయ్. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి చిన్నా చితక లీడర్లపై భూ ఆక్రమణ ఆరోపణలు వినిపిస్తున్నాయ్. తాజాగా మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదంలో తెరాస ప్రజాప్రతినిధులు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా చామన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

చామన్‌పల్లి ఎంపీటీసీ లక్ష్మయ్య, ఆ గ్రామ సర్పంచి మధ్య దారి స్థలంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు వర్గాలు పెద్దపెద్ద రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. గ్రామస్థులు వారిని నిలువరించాలని యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవలే అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈ రకమైన ఆరోపణలు వచ్చినా.. దానికి సంబంధించిన ఆడియో, వీడియో ఫ్రూప్ లు బయటపడిన సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. ఈటెల విషయంలో మాత్రం జెడ్ స్పీడుతో చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది రాజకీయ కుట్ర అనే ప్రచారం జరుగుతోంది.