షర్మిల సటైర్ : కాంట్రాక్ట్ సీఎంని పెట్టుకుంటే పోలే
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల.. నిరుద్యోగ సమస్యని ఎత్తుకొన్న సంగతి తెలిసిందే. వెంటనే ఉద్యోగాలని భర్తీ చేయాలని ఆ మధ్య మూడ్రోజుల పాటు దీక్ష కూడా చేసింది. ఆ వెంటనే కరోనా బారినపడింది. కోలుకుంది కూడా. తాజాగా మరోసారి ఉద్యోగాల భర్తీపై షర్మిల ప్రశ్నించింది.
ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు.