కరోనాతో మంత్రి కన్నుమూత

కరోనా ఎవ్వరినీ వదలడం లేడు. కరోనాకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖు బలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. రెవెన్యూ మంత్రి విజయ్ కశ్యప్(56) కొవిడ్‌కు చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. యూపీ మంత్రుల్లో కరోనాతో ప్రాణాలు విడిచిన మంత్రుల్లో కశ్యప్ మూడో వ్యక్తి. గతేడాది కమల్‌రాణి వరుణ్, చేతన్ చౌహాన్ కరోనా సోకి మరణించారు.
శరత్వాల్ నియోజకవర్గానికి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కశ్యప్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కోల్పోయామన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.