గాంధీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. హాస్పటల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితుల దగ్గరకు వెళ్లి సీఎం పరామర్శించారు. ICU లో చికిత్స పొందుతున్న పేషంట్ల ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కరోనా చికిత్స పొందుతున్న పేషంట్ల కు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యశాఖని తన దగ్గర పెట్టుకొని.. ఆసుపత్రులని గాలికొదిలారు. ఆసుపత్రుల్లో ఎలాంటి వసతుల్లేవ్. వాటి గురించి పట్టించుకొనే నాథుడే లేడు. ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని పీకేశారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. తాజాగా గాంధీ హాస్పటల్ పర్యటనతో ఈ ప్రచారానికి సీఎం కేసీఆర్ చెక్ పెట్టినట్టయింది.

ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఓ పక్షం రోజుల పాటు తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. కోలుకున్నారు. కోలుకున్నాక తొలిసారి ప్రగతిభవన్ కి వచ్చిన సీఎం కేసీఆర్.. కరోనా కట్టడి కోసం వరుసగా సమీక్షలు నిర్వహించారు. కేభినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే లాక్‌డౌన్‌ పై నిర్ణయం తీసుకున్నారు. మొదట పదిరోజుల లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆ తర్వాత దానిని ఈ నెల 30 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.