వర్షంలో నటి పోజులు.. నెటిజన్స్ ఫైర్ !

వర్షం పడుతుంటే..  హిందీ టెలివిజన్‌ నటి దీపిక ఆగలేకపోయింది. వెళ్లి వర్షంలో డ్యాన్స్‌ చేయడంతో పాటు ఒక చెట్టు వద్ద నిలబడి ఫొటోలకు పోజులచ్చింది. అది కూడా ఈదురు గాలులు వర్షం కారణంగా విరిగిన చెట్టు వద్ద ఆమె పోజులిచ్చింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలని చూసిన నెటిజన్ల మండిపడుతున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి..? నువ్వు చేస్తున్న పని ఏంటంటూ.. చురకలు అంటించారు. 

ఓవైపు కరోనా దేశాన్ని వణికిస్తుంటే మరోవైపు తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది.  ముంబయిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలి రోడ్లమీద పడ్డాయి. అయితే.. వర్షం పడుతున్న సమయంలో దీపికాసింగ్‌.. ఆ వర్షంలో డ్యాన్స్ చేస్తూ.. విరిగిన చెట్టు దగ్గర ఫొటోలకు పోజులచ్చింది. దీంతో ఆమెని నెటిజన్స్ తగులుకున్నారు. ‘ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అంటూ గట్టిగానే వేసుకున్నారు. అటు నుంచి రియాక్షన్ లేదనుకోండి.. !