ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్

రేపు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, బర్త్ డే CDP, సినిమా పోస్టర్స్, పవర్ ఫుల్ పోజులతో హోరెత్తిస్తున్నారు. ఐతే మంచి జోష్ లో ఉన్న అభిమానులకు తారక్ నిరాశపరిచారు. ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్ దూరంగా ఉండాలని అభిమానులని కోరారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని.. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖని విడుదల చేశారు. మరోవైపు అభిమానులకి తారక్ ఒకటి కాదు రెండు బహుమతులని రెడీ చేయడం విశేషం.

తారక్ బర్త్ డే కానుకగా రేపు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గిఫ్ట్ రానుంది. INTENSE #KomaramBheem పేరిట ఓ టీజర్ లాంటి విడుదల చేయనున్నారు. గత యేడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ని ఇవ్వలేకపోయింది. ఐతే ఈ సారి మాత్రం తారక్ అభిమానులని నిరాశపరచలేదు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్ టీఆర్ సినిమాకు సంబంధించి రేపు అప్ డేట్ రానుంది. సినిమాని ఖరారు చేస్తూ.. అప్ డేట్ ఇస్తారా ? టైటిల్, హీరోయిన్ ఎవరో చెప్పేస్తారా ?? అన్నది సస్పెన్స్. మొత్తానికి.. తారక్ నుంచి రెండు బర్త్ డే గిఫ్ట్ లు అందనున్నాయి.

Unveiling @tarak9999 as INTENSE #KomaramBheem tomorrow, 10 AM. 🌊#RRRMovie.

We urge all fans to stay home, stay safe and not to come out to celebrate! #RRR @ssrajamouli @AlwaysRamCharan @AjayDevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies @RRRMovie pic.twitter.com/AxqokRHrYk— RRR Movie (@RRRMovie) May 19, 2021