లాక్డౌన్ను మరింత కఠినంగా
లాక్డౌన్ను మరింత కఠినంగా అమలుచేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులని ఆదేశించారు. బుధవారం సీపీ, ఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలి. ఉదయం 10గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
ప్రధాన రహదారులపైనే కాకుండా అంతర్గత రహదారులు, కాలనీలపైనా దృష్టిపెట్టాలన్నారు. పోలీసులు గస్తీ వాహనాల్లో సైరన్ శబ్దం చేస్తూ కాలనీల్లో సంచరించాలని డీజీపీ ఆదేశించారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని, దీంతో మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని తెలిపారు. ఉదయం 6గంటల నుంచే మినహాయింపులు ఉన్నా జనం మాత్రం 8గంటలకు బయటకు వస్తున్నారని డీజీపీ తెలిపారు. చేపలు, కూరగాయల మార్కెట్ల వద్ద జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.