కాజల్ చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు !
హీరోయిన్ కాజల్ చేసిన ఓ పనికి నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. కాజల్ జీవిత కాలం లేట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజంగానే కాజల్ చేసిన పని.. పెళ్లి చేసుకున్న టైమ్ చెప్పిన విషెస్ కి కాజల్ పిల్లలు పుట్టాక రిప్లై ఇచ్చినట్టుంది. గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకుంది కాజల్. గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది.
పెళ్లి చేసుకున్న మరుసటి రోజే అనుష్క ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. పెళ్లికి సంబంధించి పెద్ద కొటేషన్ పెట్టి మరీ కాజల్ ను విష్ చేసింది. అలా అనుష్క శుభాకాంక్షలు చెప్పిన 7 నెలలకు కాజల్ స్పందించింది. ఈరోజు రిప్లయ్ ఇచ్చింది. ఓ 3 లవ్ సింబల్ ఎమోజీలు తగిలించి థ్యాంక్స్ చెప్పింది. కాజల్ చేసిన ఈ పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఆమెపై సటైర్స్ వేస్తున్నారు.