RRR : NTR బర్త్ డే పోస్టర్.. అదిరింది !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఈ నేపథ్యంలో #RRR కోసం ప్రేక్షకులు భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తారక్ బర్త్ డే కానుకగా.. కొమరం భీమ్ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. కొమరం భీమ్ కళ్లు ఎర్రబడ్డాయ్. బల్లెం ఎక్కుబెట్టి విరుస్తున్నాడు. అది టార్గెట్ లో దిగిపోవడం పక్కా అన్నట్టుగా పోస్టర్ ఉంది.

స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితంలోని ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళి ఈ కథని రాసుకున్నారు. అల్లూరి నిప్పు, కొమరంభీమ్ ని నీరుగా చూపించబోతున్నారు. నీరు-నిప్పు ఎలా కలిశాయ్. వారి పోరాటం ఎలా సాగింది ? అన్నది జక్కన్న చూపించబోతున్నారు. ఈ చిత్రంలో కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.