ప్లాప్ ఇచ్చిన దర్శకుడితో నాగ్ మరో సినిమా

కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయడం నాగ్ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే రామ్ గోపాల్ వర్మతో శివ లాంటి సినిమాలు చేశారు. ట్రెండ్ సెట్ చేశాడు. ఈ వయసులోనూ నాగ్ కొత్త దర్శకులతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ‘చిలసౌ’తో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ కి నాగ్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన్మథుడు 2
డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత రాహుల్ కనిపించకుండా పోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌తో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నాడట.

ఈ సినిమా నాగ్ హీరోగా కాదు. ఇదో ప్రయోగం అని తెలిసింది. పూర్తిగా కొత్తవాళ్లతో రాహుల్ సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిలసౌ లానే ఓ కొత్త తరహా ప్రేమకథని రాహుల్ తెరపై చూపించబోతున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించబోతోంది. అక్కినేని హీరోల్లో ఎవరో ఒకరు..ఇందులో గెస్ట్ రోల్ లో మెరవనున్నారని సమాచారమ్.