RRR రిలీజ్ డేట్ మారలేదు

ఆర్‌.ఆర్‌.ఆర్‌ – అక్టోబ‌రు 13న ప్రేక్షకుల ముందుకు తీస్తుకొస్తున్నామ‌ని చిత్ర‌బృందం ఎప్పుడో ప్ర‌క‌టించేసింది. అప్పుడు ఈ సినిమా రావ‌డం దాదాపు అసాధ్య‌మే అని చిత్ర‌సీమ‌తో పాటు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానులు కూడా న‌మ్ముతున్నారు. ఐతే అనూహ్యంగా ఈ రోజు కొమ‌రం భీమ్ పోస్ట‌ర్ లో రిలీజ్ డేట్ కూడా కనిపించింది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం మ‌రోసారి స్పష్టం చేసింది. కచ్చితంగా #RRR అక్టోబర్ 13 వస్తుందా ? అంతే.. విడుద‌ల తేదీ మార్చే ఛాన్సుంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

మరోవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌ రిలీజ్ వాయిదా పడితే.. అక్టోబ‌రు 13న ఏర్ప‌డిన ఖాళీని పూడ్చాల‌ని పుష్ష లాంటి సినిమాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. పుష్పతో పాటుగా మరికొన్ని సినిమాలు అక్టోబ‌రు 13ని టార్గెట్ చేశాయి. ఐతే ఇప్పటికిప్పుడు ఆ డేటుని ఇతర సినిమాలకు ఇవ్వడం జక్కన్నకి ఇష్టం లేదు. అందుకే ఇంకా ఆ డేటునే పట్టుకొని కూర్చున్నాడు. నిజంగానే ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13 కే వచ్చినా.. మిగితా సినిమాలు చేసేది ఏమీలేదు. సైడైపోవాల్సిందే.