వెలుగులోకి వైట్‌ ఫంగస్‌

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న టైమ్ లోనే బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ ఫంగస్ ఎటాక్ చేస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు భయపెడుతున్న వేళ కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగుచూసింది. బిహార్‌లోని పట్నా వైద్య కళాశాలలో తాజాగా నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి.

బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్‌ ఫంగస్‌ ఉన్న నలుగురికీ కరోనా సోకలేదని తెలిపారు. వైట్‌ ఫంగస్‌ రోగుల్లో కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలైన గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, ప్రైవేటు భాగాలు, నోరు భాగాలపై వైట్ ఫంగస్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ అరుదైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. హెచ్‌ఆర్‌సీటీ టెస్ట్‌ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.