మోహన్‌బాబు ఇంట్లో రజనీ.. రెండ్రోజులు !

రజనీకాంత్, మోహన్‌బాబు మంచి మిత్రులు. ప్రాణ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ టైమ్ లో ఈ ఇద్దరు మిత్రులు కలిశారు. రజనీ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అణ్ణాత్తే’. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్తి చేసుకుంది. రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న రజనీ హైదరాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండ్రోజుల పాటు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. తాజాగా రజనీతో కలిసి దిగిన ఫోటోలని విష్ణు మంచు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
