బీఏ రాజు.. ఓ నాలెడ్జ్‌ బ్యాంక్‌ !

సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు అకాలమరణం టాలీవుడ్ ని షాక్ గురిచేసింది. ద్రిగ్బాంతిని కలిగించింది. ఇక బీఏ రాజు లేరన్న నిజాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ? బీఏ రాజు అందరివాడు. మంచివాడు. టాలీవుడ్ ఎన్‌సైక్లోపిడియాలా. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల టైటిల్స్ కోసం రాజుని అడిగేవారు.

ఇక బీఏ రాజు లేడన్న నిజాన్ని సినీ స్టార్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త వినగానే షాక్ గురై.. ఆ తర్వాత తేరుకొని సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్.. సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రేక్షకులు.. ఇలా ప్రతి ఒక్కరు బీఏ రాజు మృతి పట్ల సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. 

బీఏ రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. సినిమాల సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడులయ్యింది..? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత గొప్ప పత్రికా జర్నలిస్ట్‌’ అని రాసుకొచ్చారు.