తీవ్ర తుపాన్‌గా సైక్లోన్ యాస్
కరోనా ఉదృతితో అల్లాడిపోతున్న దేశానికి తుఫాన్ ముంపు వచ్చిపడింది. సైక్లోన్ యాస్ తీవ్ర తుపాన్‌గా మారి మే 26న ఒడిశా, బెంగాల్ తీరాలను దాటొచ్చని శనివారం భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది.
‘ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తూర్పుమధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. 26వ తేదీ ఉదయానికి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని ఆ తర్వాత తీరం దాటుతుంది. వాతావరణశాఖ తెలిపింది. ఇక ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.