‘సినిమా మ్యూజియం’ ఏర్పాటు చేస్తున్ననాగ్

కింగ్ నాగార్జునకి ఓ బలమైన కోరిక ఉంది. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అలాగని అది సినిమా కాదు. ‘సినిమా మ్యూజియం’. సినిమాకు సంబంధించిన జ్ఞాప‌కాలన్నీ ఓ చోట భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని అనుకుంటున్నారంట.

 అపుపూర‌మైన పాత సినిమాలు, ఆయా సినిమాల్లో వాడిన కాస్ట్యూమ్స్‌, కెమెరాలు, ఇత‌ర సాంకేతిక సామాగ్రి ఇలాంటివ‌న్నీ… ఓచోట‌కు చేర్చాల‌న్న‌ది నాగ్ తాప‌త్ర‌యం. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఎప్పుడో ప్రారంభ‌మైపోయింది. కరోనా విజృంభణ, లాక్ డౌన్‌ ఆలస్యం అవుతుందంతే. 

ముందుగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన సినిమాల్ని, ఆయ‌న కాస్ట్యూమ్స్‌ని సేక‌రించి, వాటిని ఓచోట‌కు చేర్చాల‌ని భావిస్తున్నారు. ఆ ప‌ని చాలా వ‌ర‌కూ పూర్త‌య్యింది కూడా.  అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్‌లో గానీ, అన్న‌పూర్ణ స్టూడియోలోని గ్లాస్ హౌస్ ని గానీ ‘సినిమా మ్యూజియం’ని ఏర్పాటు చేయబోతున్నారని తెలిసిందే. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.