రాధేశ్యామ్ పాట.. క్లారిటీ వచ్చేసింది !

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ప్రభాస్-పూజాహెగ్డే మధ్య ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని వదిలేసి, ప్యాచ్ వర్క్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టేద్దామని యూనిట్ భావించింది. ఐతే నార్త్ బయ్యర్లు పాట  ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ఆ పాట పెట్టడం వలన ఉత్తరాదిన మైలేజీ పెరుగుతుందని, పెట్టాల్సిందేనంటూ టి-సిరీస్ పట్టుబట్టింది.

దీనిపై నార్త్ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి డిస్కషన్ నడిచింది. మిగిలిన ఆ ఒక్క పాటను కూడా షూట్ చేయాలని యూనిట్ నిర్ణయించింది. పాటతో కలిపి సినిమాకు సంబంధించి 8-10 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఇక రాధేశ్యామ్ సెట్స్ మీద ఉండగానే సలార్, ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకు తీసుకెళ్లారు ప్రభాస్. కరోనా సెకండ్ వేవ్ విజృంభణలో ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది.