అశ్లీల వీడియో.. నాలుగు రోజులు బయటికి రాలేదు !

ఎక్కడా రాజీ పడకుండా పాత్ర కోసం ఎంతటి సాహసాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉండే నటి రాధికా ఆప్టే. పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకైనా ఆమె రెడీ. ‘పార్చ్‌డ్‌’ సినిమా కోసం ఆమె అదే చేసింది.  కొన్ని అశ్లీల సన్నివేశాల్లో కనిపించారు. కానీ సినిమా రిలీజ్ కంటే ముందే ఆ సీన్స్ అప్పట్లో లీకయ్యాయ్. ఆ టైమ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

“2015లో నేను నటించిన ‘పార్చ్‌డ్‌’ వల్ల ఇబ్బందులు పడ్డాను. స్త్రీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’లో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నేను కనిపించాను. ఆ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడానికంటే ముందు టోరెంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దాంతో నేను నటించిన అశ్లీల సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. నా డ్రైవర్‌, వాచ్‌మెన్‌, అలాగే నా స్టైలిష్ట్‌ డ్రైవర్‌.. ఇలా ప్రతిఒక్కరూ నన్ను గుర్తుపట్టారు. దాంతో నేను నాలుగు రోజులు ఇంటి గడప దాటలేదు. ఎంతో బాధగా అనిపించింది” అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.