పవన్ తో సినిమా.. బండ్ల బాధ ఇదీ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉ.. అంటే దేశంలో టాప్ దర్శకులు ఆయన ముందు క్యూ కడతారు. ఇప్పటికే టాలీవుడ్ దర్శకులు పవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఒకేసారి దాదాపు అరడజను సినిమాలని పవన్ లైన్ లో పెట్టారు. ఇందులో బండ్ల గణేష్ తో సినిమా ఒకటి. కానీ బండ్లకు సరైన దర్శకుడు దొరకడం లేదట. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా నిర్మించాడు బండ్ల. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఆపై బండ్ల బడా నిర్మాతగా మారాడు.

ఆ తర్వాత పడిపోయాడు కూడా. సినిమాలకు దూరమయ్యాడు. తిరిగి పవన్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆయనకు పవన్ ఓకే చెప్పేశారు. కానీ పవన్ తో సినిమా తీసేందుకు సరైన దర్శకుడు దొరకడం లేదని బండ్ల వాపోతున్నాడు. పవన్ తో సినిమా చేస్తే.. తన మిగిలిసిన సినిమాలకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. రమేష్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న రమేష్ వర్మ.. తదుపరి సినిమా పవన్ తోనే. బండ్ల నిర్మాణంలోఉండనుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని బండ్ల కొట్టిపారేశాడు.