జగన్ ని బయటికి లాగుతున్న కేసీఆర్

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల సీఎంలలో.. ఒక్కఏపీ సీఎం జగన్ తప్ప అందరూ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఎక్కువగా ఫామ్ హౌజ్ లోనే ఉంటారనే అపవాదు ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వలనే కేసీఆర్ కరోనా బారినపడ్డారని చెప్పుకొన్నరు. ఇక కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్.. ఆసుపత్రుల సందర్శనని మొదలెట్టారు. 

మొదట హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని విజిట్ చేసిన సీఎం కేసీఆర్… ఆ తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. నేరుగా కోవిడ్ రోగులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేసీఆర్ చేస్తున్న ఈ పని జగన్ కు తిట్లు తెచ్చిపెడుతోంది. కరోనా భయంతో ఏపీ సీఎం జగన్.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొనలేదు. అది ఆయన ముందు చూపు కావొచ్చు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ బయటికొచ్చి.. ఆసుపత్రుల సందర్శనకు వెళ్తుంటే.. ఆ పని సీఎం జగన్ ఎందుకు చేయరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిరిగా ఏపీ సీఎం జగన్‌ కూడా తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావాలని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కోవిడ్‌ నివారణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సైతం రాజకీయం చేయడం జగన్‌కే చెల్లిందని విమర్శించారు. కేసీఆర్ తో జగన్ కు కన్నా పెట్టిన లింకు భలే కుదిరింది. కన్నా మాటలు విన్న ఏపీ ప్రజలు జగన్ ని కేసీఆర్ బయటికి లాగేదాక వదలేలా లేదని కామెంట్స్ చేస్తున్నారు.